ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గేదెలు కాపాడేందుకు వెళ్లి.. రైతు మృతి - ubalanka farmer died news

గోదావరి లంకలో ఉన్న గేదెలను రక్షించటానికి వెళ్లిన రైతు... ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లా ఉబలంకలో జరిగింది.

farmer died
రైతు మృతి

By

Published : Aug 18, 2020, 11:15 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఉబలంక గ్రామానికి చెందిన దండు త్రిమూర్తి వెంకట సత్యనారాయణ రాజు గోదావరి నదిలో ప్రమాదశాత్తూ పడి మృతి చెందాడు. సత్యనారాయణ రాజుకి చెందిన గేదెలు లంక పొలాల్లో ఉన్నాయి.

గోదావరి నది ప్రవాహం పెరుగుతున్నందున, వాటిని బయటకు తీసుకువచ్చేందుకు.. లంకలోకి వెళ్లాడు. వాటిని తీసుకొస్తుండగా.. ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details