పోలవరం నిర్వాసితులు, గిరిజనుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ... తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ వద్ద... రైతు కూలీ సంఘం ఆందోళన చేపట్టింది. రెండో రోజు కొనసాగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు. దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని నిరసనకారులు మండిపడ్డారు.
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య... ఆందోళన కారులతో చర్చించారు. పది రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ అధికారులను పంపించి, నివేదికను తయారు చేస్తామని హామీ ఇచ్చారు.