తూర్పుగోదావరి జిల్లా రేఖవానిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందాడు. కుమ్మరిలోవ గ్రామానికి చెందిన అప్పారావు వరి పంటకు పురుగు మందు పిచికారీ చేసేందుకు..కూలీకి వెళ్లాడు. పంట చేనులో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి పది నెలల క్రితమే వివాహమవగా...ప్రస్తుతం అతని భార్య ఏడు నెలల గర్భిణీ. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
విద్యుత్ తీగలు తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రేఖవానిపాలెంలో జరిగింది. వరి పంటకు పురుగు మందు పిచికారీ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి