ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

100ఏళ్ల అమ్మకు పాదపూజ చేసిన కుటుంబ సభ్యులు

శతాబ్దకాలం పూర్తిచేసుకున్న ఆ అవ్వకు కుటుంబసభ్యులు అంతా కలసి పాదాభివందనం చేశారు. మనవరాళ్లు ,మనవళ్లు కలిపి 68 మంది ఉన్న ఆ అమ్మమ్మ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉంటుంది.

100 ఏళ్ల అవ్వకు పాదాభివందనం

By

Published : Sep 2, 2019, 10:20 AM IST

100 ఏళ్ల అవ్వకు పాదాభివందనం

100ఏళ్లు పూర్తయిన అమ్మకు68మంది ఉన్న కుటుంబమంతా పాదపూజ చేశారు.తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని ఆచళ్ళ కామేశ్వరమ్మకు కుమారులు,కుమార్తెలు,మనవళ్లు,మనవరాళ్లు,ముని మనుమళ్ళు,మునిమరళ్ళు మొత్తం68మంది ఉన్నారు.నూటొక్క ఏడాది పుట్టిన రోజును ఇటీవల జరుపుకున్న కామేశ్వరమ్మకు పాదపూజ చేసేందుకు,ఎక్కడెక్కడో స్థిరపడిన కుటుంబ సభ్యులంతా ఒక చోటకు చేరారు.అమ్మకు జే జే లు పలికి ఆశీర్వాదం తీసుకున్నారు.చిన్నపెద్ద అందరు ఒక చోట చేరి పెద్దావిడను సన్మానించడంతో కాలనీలోను సందడి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details