ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Corona Affect: కరోనా భయం.. ఏడాదిన్నరగా స్వీయ గృహనిర్బంధం! - తూర్పుగోదావరిలో ఏడాదిన్నరగా స్వీయ గృహనిర్బంధంలో ఉంటున్న కుటుంబం

కరోనా భయంతో.. ఓ కుటుంబం ఏడాదిన్నరగా స్వీయ గృహనిర్బంధంలో ఉన్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. ప్రభుత్వం వారికి ఇంటి స్థలం మంజూరు చేయడంతో.. ఇటీవల పంచాయతీ సిబ్బంది వెళ్లి ఆ ఇంట్లోని మహిళను బయోమెట్రిక్‌ వేలిముద్ర వేయాలని అడిగారు. తాము బయటికి రామని, ఇంటిస్థలం వద్దు అని బదులిచ్చారు. అప్పుడు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది.

family afraid of corona
కరోనా భయంతో ఏడాదిగా గృహనిర్భందంలో ఉంటున్న కుటుంబం

By

Published : Jul 19, 2021, 9:47 AM IST

Updated : Jul 19, 2021, 4:21 PM IST

కరోనా తమను ఎక్కడ కబళిస్తుందోననే మానసిక ఆందోళనకు గురైన ఓ కుటుంబం.. ఏడాదిన్నరగా ప్రపంచానికి దూరంగా, స్వీయ గృహనిర్బంధంలో ఉన్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. ఆ కుటుంబంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండగా తండ్రి, కుమారుడు మాత్రమే బయటకు వస్తున్నారు. తండ్రికి వచ్చే దివ్యాంగ పింఛను, రేషన్‌ బియ్యంతోనే కాలం గడుపుతూ వచ్చారు.

ప్రభుత్వం వారికి ఇంటి స్థలం మంజూరు చేయడంతో.. ఇటీవల పంచాయతీ సిబ్బంది వెళ్లి ఆ ఇంట్లోని మహిళను బయోమెట్రిక్‌ వేలిముద్ర వేయాలని అడిగారు. తాము బయటికి రామని, ఇంటిస్థలం వద్దు.. వెళ్లిపోవాలని ఆమె కోరారు. ఈ విషయం సర్పంచి ద్వారా తెలుసుకున్న పోలీసులు.. వారిని ఆదివారం మధ్యాహ్నం బయటికి తీసుకొచ్చారు. సరైన పోషకాహారం లేక ఆ ముగ్గురు మహిళలు అనారోగ్యంతోపాటు మానసికంగానూ ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించి.. రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్సై కృష్ణమాచారి తెలిపారు.

Last Updated : Jul 19, 2021, 4:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details