ఉరిమిన మేఘం...పడిపోయిన వరిచేలు - కోనసీమ ప్రాంతంలో పడిపోయిన వరిచేలు
కోనసీమ ప్రాంతంలో నిన్న కురిసిన భారి వర్షానికి పలుచోట్ల ఖరీఫ్ వరి చేలు పడిపోయాయి. కోనసీమ మొత్తం మీద సుమారు రెండు వేల ఎకరాలు పైబడి విస్తీర్ణంలో ఖరీఫ్ వరి చేలు పడిపోయి ఉంటాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నిన్న కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల ఖరీఫ్ వరి చేలు పడిపోయాయి. కోనసీమ మొత్తం మీద సుమారు రెండు వేల ఎకరాలు పైబడి విస్తీర్ణంలో ఖరీఫ్ వరి చేలు పడిపోయి ఉంటాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోనే సుమారు 800 వందల ఎకరాలు వరి పంట పడిపోయిందని...సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్జీవి.రామ మోహన్ రావు తెలిపారు. పడిపోయిన వరికంకులను నిలబెట్టి...కట్టి చేనులో ముంపు నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. పడిపోయిన చేలల్లో ధాన్యం దిగుబడి 20శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు.