తూర్పుగోదావరి జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయిదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 88 లక్షల 74 వేల 500 నకిలీ నోట్లు, ప్రింటర్లు, స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. తాళ్లరేవు మండలం సుంకటరేవు గ్రామంలోని లక్ష్మీ స్టూడియోపై దాడి చేసి నకిలీ నగదును స్వాధీనం చేసునట్లు ఎస్పీ నయీంఅస్మీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దంగేటి శ్రీనివాసరావు అని ఎస్పీ వెల్లడించారు. గతంలో రంగురాళ్ల వ్యాపారం చేసిన శ్రీనివాసరావు...ఆర్థికంగా దెబ్బతిన్నాడని తెలిపారు. అసలు నోట్లతో నకిలీ నోట్లు జతచేసి రంగురాళ్లు, రైస్‌పుల్లింగ్, పురాతన పంచలోహ విగ్రహాల వ్యాపారం చేసి డబ్బు గడించాలనే పథకం రచించినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే బ్రాహ్మాజీ, దశరథరాముడు, చినమావుళ్లు,రాజ్‌కుమార్‌లతో కలిసి నకిలీ నోట్ల తయారు చేశారన్నారు. పిఠాపురానికి చెందిన నారాయణ అనే వ్యక్తి దగ్గర 30 లక్షలకు పురాతన నాగదేవత విగ్రహం కొనుగోలు చేశారని...అందులో 10 లక్షల నోట్లు నకిలీవి ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కేసులో నిందితులతో పాటు నారాయణపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
అంబాజీపేటలో మరో ముగ్గురు