ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ నగలతో కోటి రుణం.. బ్యాంకు ఉద్యోగి అరెస్టు - east godavari district latest crime news

సమనస ఎస్బీఐ బ్రాంచ్​లో నకిలీ బంగారు రుణాలు పేరిట రూ. కోటి నగదు కాజేసిన బ్యాంకు ఉద్యోగిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని డీఎస్పీ షేక్​ మాసూం భాషా తెలిపారు.

fake gold loan created by samanasa branch sbi employee
ఉద్యోగిని అరెస్ట్​ చేసిన డీఎస్పీ షేక్​ మాసూం భాషా

By

Published : Oct 18, 2020, 6:31 PM IST

అమలాపురం రూరల్​ మండలం సమనస ఎస్బీఐ బ్రాంచ్​లో నగదు అధికారిగా పని చేస్తున్న బులుసు వీర వెంకట సత్య సుబ్రహ్మణ్య శర్మను... పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ షేక్​ మాసూం భాషా వెల్లడించారు. 2019 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జూలై 24 మధ్య కాలంలో బ్యాంకులో నకిలీ బంగారు రుణాల పేరిట రూ. కోటి నగదును మాయం చేశాడు.

ఈ విషయంపై... సెప్టెంబర్​ 29న బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలె బ్యాంకులో జరిగిన ఇంటర్నెల్​ ఆడిట్​లో నకిలీ బంగారు రుణాల వ్యవహారం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details