'చంద్రబాబు సంక్షేమ పథకాలే నా గెలుపుకు తారకమంత్రం' - చలమలశెట్టి సునీల్
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు మార్గనిర్దేశాలకు అనుగుణంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అభిప్రాయపడ్డారు. తెదేపా తరఫున బరిలో దిగుతున్న సునీల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
చలమలశెట్టి సునీల్
గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తన గెలుపుకు కారణమవుతాయని కాకినాడ పార్లమెంటు స్థానంలో తెదేపా నుంచి పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా తెలుగుదేశానికే పట్టం కడతారని అభిప్రాయపడ్డారు. కాకినాడ స్మార్ట్ సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని సునీల్ అన్నారు. యువత ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని చలమలశెట్టి సునీల్ తెలిపారు.