తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని జగన్నాయక్ పూర్ పెట్రోలు బంక్ వద్ద యువతి నిరసన చేపట్టింది. పెట్రోల్ బంక్ ఓనర్ ప్రేమ పేరుతో తనను మోసం చేసి గర్భవతిని చేశాడని ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో వంచన చేశాడని బిడ్డతో కలిసి యువతి ఆందోళన చేపట్టింది.
తల్లిని చేశాడు..పెళ్లి అనే సరికి ముఖం చాటేశాడు..! - కాకినాడలో ప్రేమ మోసం
ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు మోసం చేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని యువకుడి పెట్రోల్ బంక్ ముందు నిరసన చేపట్టింది.
face book love ruined girl life at west godavari palkoderu
పాలకోడేరుకు చెందిన బలే శ్రీదేవి, కాకినాడకు చెందిన కర్రి కిరణ్ పాల్ రెడ్డి ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. కొన్నిరోజుల తర్వాత ప్రేమలో పడ్డారు. కిరణ్పాల్ రెడ్డి యువతిని తల్లిని చేసి... ముఖం చాటేశాడు. యువతి పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. యువతిని కిరణ్పాల్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని కిరణ్ పాల్ రెడ్డి పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు