ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం' - చిన్నవారి పాలెంలో కళ్లజోళ్ల పంపిణీ వార్తలు

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అక్కడ కళ్లజోళ్లను పంపిణీ చేశారు. కోవిడ్ ఆసుపత్రిలో సేవలందించిన డాక్టర్​ను ఆయన సన్మానించారు. ఆత్రేయపురం మండలంలో పలు పనులకు శంకుస్థాపన చేశారు.

eye tests at ubalanka
డాక్టర్​కు సన్మానం

By

Published : Oct 29, 2020, 8:28 PM IST


తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో వైయస్ఆర్ కంటి వెలుగు పథకంలో భాగంగా 257 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. చిన్నవారి పాలెంలో కళ్లజోళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోవిడ్-19 పై పోరాటంలో ఉత్తమ సేవలందించిన ఉబలంక డాక్టర్ దుర్గాప్రసాద్​ను ఆయన సన్మానించారు. ఆత్రేయపురం మండలం వీరేపల్లికట్టలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్నంవారి పాలెంలో రేవును ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details