ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీ యువకుడి శిరోముండనంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

ఎస్సీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం పోలీసుస్టేషన్‌లోనే.. శిరోముండనం చేయిస్తుందా? అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే ఈ సంఘటన జరిగిందని హర్షకుమార్ అన్నారు. ఎస్‌ఐను సస్పెండ్ చేసినంత మాత్రాన సరిపోదన్న హర్షకుమార్.. బాధ్యులైన అందరినీ సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు.‌

ex mp harshakumar
ex mp harshakumar

By

Published : Jul 21, 2020, 5:51 PM IST

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లోనే ఎస్సీ యువకుడు వరప్రసాద్​కు శిరోముండనం చేశారు పోలీసులు. ఈ ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్సీలను కావాలనే అణిచివేయాలని చూస్తుందని దుయ్యబట్టారు.

4 రోజులు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన బాలికకు న్యాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ బాలికపై అత్యాచారం, మరో ఎస్సీకి శిరోముండనం ఇదేనా మాకు న్యాయం? అంటూ మండిపడ్డారు. ఎస్సీ ప్రజాప్రతినిధులు, హోంమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇది అవమానం అని పేర్కొన్నారు. ఎస్సీలను కచ్చితంగా అణిచివేయాలనే ప్రభుత్వం చూస్తోందని హర్షకుమార్ ఆరోపించారు.

పెయిడ్ బ్యాచ్‌లను ప్రభుత్వం డబ్బులిచ్చి పోషిస్తోందని హర్షకుమార్ ఆరోపించారు. పార్టీల ముసుగులు వదిలేసి అందరూ ఈ ఘటనలను ఖండించాలని కోరారు. 24 గంటల్లో ఎస్సీ యువకుడి శిరోముండనం వెనుక ఉన్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీతానగరం వద్ద అక్రమ ఇసుక ర్యాంపులన్నీ నిలిపివేయాలన్నారు. 24 గంటల్లో పోలీసు అధికారులపై, సూత్రధారులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి:అమూల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details