ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ మంత్రి ఫోన్ కాల్​తోనే... బోటు కదిలింది : మాజీ ఎంపీ హర్షకుమార్ - మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వలన

కచ్చులూరు గోదావరి బోటు ప్రమాదంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిఖీల్లో దేవీపట్నం వద్ద నిలిపివేసిన బోటు.. మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వలన ముందుకు కదిలిందన్నారు. గోదావరిలో తిరిగే ప్రైవేట్ బోట్లలో పర్యాటకశాఖ అధికారుల పెట్టుబడులున్నాయని హర్షకుమార్ ఆరోపించారు.

ఆ మంత్రి ఫోన్ కాల్​తోనే... బోటు కదిలింది : మాజీ ఎంపీ హర్షకుమార్

By

Published : Sep 19, 2019, 6:12 PM IST

గత ఆదివారం గోదావరిలో ప్రమాదానికి గురైన పర్యాటక బోటులో 93 మంది ఉన్నారని విశ్వాసనీయ సమాచారమని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ చెప్పారు. దేవీపట్నం వద్ద రాయల్ వశిష్ట బోటు ఎస్సై తనిఖీ చేసి, ముందుకు సాగేందుకు అనుమతి నిరాకరించారని హర్షకుమార్ అన్నారు. కానీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌... తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీంఅస్మీకి ఫోన్‌ చేసి చెప్పడం వల్లే బోటు ముందుకు సాగిందని రాజమహేంద్రవరంలో చెప్పారు. నదిలో బోటు జాడ సోమవారం మధ్యాహ్నమే గుర్తించినా నిన్నటివరకూ చెప్పలేదని ఆరోపించారు. ఫ్లోటింగ్‌ జెట్టీ ద్వారా మునిగిన బోటును వెలికితీయొచ్చని ఆయన ...ఆ ప్రయత్నాలు చేయడం లేదన్నారు. బయటికి తీసేందుకు అధికారులు సుముఖంగా లేరని, అధికారులు ముఖ్యమంత్రిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పర్యాటక బోట్లలో నాయకులు, అధికారుల పెట్టుబడులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు, అధికారుల వ్యాపారాల కోసం అమాయకుల ప్రాణాలు తీశారని విమర్శించారు. బాధిత కుటుంబాలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్న హర్షకుమార్... ముఖ్యమంత్రి కలగజేసుకుని విచారణ వేగం పెంచాలన్నారు. బోటు వెలికి తీయాలని హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఆ మంత్రి ఫోన్ కాల్​తోనే... బోటు కదిలింది : మాజీ ఎంపీ హర్షకుమార్

ABOUT THE AUTHOR

...view details