ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెహ్రూ విగ్రహం తొలగింపుపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహం - కాకినాడలో నెహ్రూ విగ్రహం తొలగింపు

దేశ మొదటి ప్రధాని నెహ్రూ విగ్రహం తొలగింపుపై.. మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్​లో.. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. పదిహేను రోజుల్లో తిరిగి ప్రతిష్ఠించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ex mp harshakumar protest
ధర్నా చేస్తున్న మాజీ ఎంపీ హర్ష కుమార్

By

Published : Dec 30, 2020, 9:18 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్​లో.. నెహ్రూ విగ్రహం తొలగించిన ప్రాంతాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ పరిశీలించారు. దేశ మొదటి ప్రధాని విగ్రహం తొలగించడం దారుణమని విమర్శించారు. అర్థరాత్రి ఎందుకు తీయవలసి వచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

విగ్రహం తొలగింపులో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాని మాజీ ఎంపీ ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు అడ్డం వచ్చిందని విగ్రహం తొలగించారా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కలెక్టర్, మేయర్, నగర కమిషనర్​లపై కేసులు పెడతామన్నారు. పదిహేను రోజుల్లో తిరిగి ప్రతిష్ఠించకపోతే జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కానని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details