ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ex MP Harsha Kumar: ఆ ఎస్సైని వెంటనే డిస్మిస్ చేయాలి: హర్ష కుమార్ - హర్ష కుమార్ న్యూస్

Ex MP Harsha Kumar On Young Man Suicide Issue: జగన్​ ముఖ్యమంత్రి అయ్యాక దళితులకు మేలు జరుగుతుందనుకుంటే.., వారిపై దాడులు ఎక్కువయ్యానని మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటలో దళిత యువకుడి ఆత్మహత్యకు కారణమైన ఎస్సైని వెంటనే డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ ఎస్సైని వెంటనే డిస్మిస్ చేయాలి: హర్ష కుమార్
ఆ ఎస్సైని వెంటనే డిస్మిస్ చేయాలి: హర్ష కుమార్

By

Published : Jan 7, 2022, 3:37 PM IST

Updated : Jan 7, 2022, 4:53 PM IST

Ex MP Harsha Kumar On Young Man Suicide Issue:వైకాపా పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరాచకం వల్ల తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటలో అమాయకుడైన దళిత యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. యువకుడి ఆత్మహత్యకు కారణమైన ఎస్సైని వెంటనే డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

లేకుంటే రేపు (శనివారం) సామర్లకోటను ముట్టడించి.. న్యాయం జరిగే వరకు అక్కడే ఉంటానన్నారు. జగన్​ ముఖ్యమంత్రి అయ్యాక దళితులకు మేలు జరుగుతుందనుకుంటే.. వారిపై దాడులు ఎక్కువయ్యానని మండిపడ్డారు. ఏపీలో ఉన్న పరిస్థితులే తెలంగాణలోనూ ఉన్నాయని.., అక్కడ కూడా పోలీసులు ప్రభుత్వ గుప్పిట్లో పనిచేస్తున్నారని హర్ష కుమార్ ఆరోపించారు.

ఏం జరిగిందంటే..
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బలుసులపేటకు చెందిన దళిత యువకుడు ఆలపు గిరీష్‌బాబు (24) బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైకాపాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశాడన్న కక్షతో, తప్పుడు కేసు పెట్టించి, పోలీసులతో కొట్టించి తన తమ్ముడి చావుకు కారణమయ్యారంటూ మృతుడి సోదరుడు ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు.

‘నేను మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశా. దీంతో వైకాపా నాయకులు మా కుటుంబంపై కోపం పెంచుకున్నారు. దొంగతనం, అత్యాచారయత్నం చేశాడని వాలంటీర్, ఆమె భర్త తప్పుడు ఫిర్యాదు చేస్తే.. అధికార పార్టీ కౌన్సిలర్, ఇతర నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసు పెట్టారు. ఎస్సై నా తమ్ముణ్ని రోజూ స్టేషన్‌కు పిలిపించి శారీరకంగా, మానసికంగా హింసించారు. దీంతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడు’ - ప్రవీణ్‌ కుమార్‌, మృతుని సోదరుడు

ఇదీ చదవండి

YOUNG MAN SUICIDE : పోలీసులు కొట్టారని దళిత యువకుడి ఆత్మహత్య..!

Last Updated : Jan 7, 2022, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details