ఏలేరు ఆధునీకరణ పనులు ప్రారంభించాలంటూ పాదయాత్ర చేపట్టిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రకు అధికారులు అనుమతి నిరాకరించడంతో పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ఉన్న తెదేపా కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.
అనుమతులు రాకపోయినా పాదయాత్ర చేసి తీరుతానని వర్మ.. నాయకులు, కార్యకర్తలను కలుపుకొని యాత్ర ప్రారంభించారు. దీంతో పోలీసులు వర్మను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతుల సమస్యల కోసం పోరాడుతుంటే అనుమతి ఇవ్వలేదని, అధికార పార్టీ సభలకు సమావేశాలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని వర్మ ఆరోపించారు.