పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రంపచోడవరంలో నిరసన చేపట్టారు. ప్రాజెక్టు ముంపు బాధితులకు ప్యాకేజీ చెల్లించకుండా గ్రామాల నుంచి ఖాళీ చేయించడం దారుణమని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాజెక్టు పూర్తవుతున్నా.. నేటికీ పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించలేదని అలాగే కొంతమందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించలేదన్నారు. సమస్యలు పరిష్కరించకుండా గ్రామాలను ఖాళీ చేయించడం తగదన్నారు. నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ఈ దీక్షలో మాజీ ఎంపీపీ తీగల ప్రభ, తెదేపా మండల అధ్యక్షుడు అడబాల బాపిరాజు, సీనియర్ నాయకులు సంఘం శ్రీకాంత్, పాము అర్జున్, గొర్ల సునీత, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ కుమార్, సీపీఐ డివిజన్ కార్యదర్శి జుట్టుక కుమార్, మట్ల వాణిశ్రీ పాల్గొన్నారు.
'ప్యాకేజీ చెల్లించకుండా ఖాళీ చేయించడం దారుణం' - polavaram rehabilitators news
పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ చెల్లించకుండా గ్రామాల నుంచి ఖాళీ చేయించడం దారుణమని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి విమర్శించారు. రంపచోడవరం వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల్లో ఆమె మాట్లాడారు.
ex mla vantala rajeswari on Polavaram expatriates
Last Updated : Jul 7, 2021, 2:17 PM IST