పోలవరం నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నాయకులు సీతంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. తేదేపా హయాంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు.
నిర్వాసితుల ఇళ్లకు, భూములకు సంబంధించి ప్యాకేజీ చెల్లించకుండా అయోమయంలో పడేశారన్నారు. జగన్ పాలనలో రెండేళ్లుగా పోలవరం ముంపు గ్రామాల ప్రజలు గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని సీతంశెట్టి ధ్వజమెత్తారు.