అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కేసును ఎత్తి వేసి వెంటనే విడుదల చేయాలని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి అరెస్టును నిరసిస్తూ కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు, పెదపళ్లలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైకాపా నేతల అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.
'వైకాపా అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ అరెస్ట్' - ex mla satyananda rao on ramakrishna reddy arrest
వైకాపా అవినీతిని ప్రశ్నిస్తుందుకే రామకృష్ణరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'వైకాపా అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ అరెస్ట్'