తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో సారా ఏరులై పారుతున్నా.. పోలీస్, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని మాజీఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. తయారీ, విక్రయాలు అధికంగా జరుపుతున్నా.. క్షేత్రస్థాయిలో నియంత్రణ కరవైందని ప్రభుత్వాన్ని విమర్శించారు. చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది ఏమీ పట్టనట్లు వ్యవహిస్తున్నారని ధ్వజమెత్తారు.
'సారా వ్యాపారులకు అధికార పార్టీ అండదండలు' - తూర్పు గోదావరి ఏజెన్సీలో అక్రమ సారా వ్యాపారుల వెనుక అధికార పార్టీ నాయకులు
సారా నియంత్రణలో పోలీసు, ఎక్సైజ్ సిబ్బంది వ్యవహార శైలిని మాజీఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తప్పుబట్టారు. అధికార పార్టీ అండదండలతోనే.. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులను విమర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే
సారా మత్తులో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రాజేశ్వరి పేర్కొన్నారు. గిరిజన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతోనే వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టి.. సారా నిర్మూలన చేయాలని డిమాండ్ చేశారు.