కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. నల్లమిల్ల రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండు రోజులుగా అనపర్తి నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి ఎక్కువుగా ఉందని ఆరోపించారు. లాక్డౌన్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం వలనే గొల్లల మామిడాడలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగటంలేదని ఆరోపించారు.
'కరోనా వ్యాప్తికి వారి నిర్లక్ష్యమే కారణం' - ex mla nallamilli ramakrishnareddy lates news
తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులకు... అధికారుల నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
కాకినాడ జేఎన్టీయూ క్వారంటైన్లో ఉంచిన వారికి సరైన సదుపాయాలు లేవని ధ్వజమెత్తారు. రెడ్‌జోన్ అమలులో ఉన్నా అనపర్తి రైతు బజార్ ప్రారంభోత్సవంలో... ఏఎంసీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పాల్గొనడం దుర్మార్గమైన విషయమన్నారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి భౌతికదూరం పాటించకుండా కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు.
ఇదీ చదవండి:కరోనా రహితంగా యానాం.. సమిష్టి కృషి, క్రమశిక్షణే కారణం!