ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి కుటంబానికి రూ. 5 వేలు, 16 నిత్యావసర సరుకులు ఇవ్వండి' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

ప్రజల ప్రాణాలు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 5 వేల రూపాయల ఆర్థిక సాయం, 16 రకాల నిత్యావసర సరుకులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ex mla nallamilli ramakrishna reddy press meet in anaparthi
అనపర్తి నుంచి మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

By

Published : Apr 15, 2020, 10:52 AM IST

ప్రజలకు కేరళ ప్రభుత్వం ఇచ్చిన విధంగా... 16 రకాల నిత్యావసర వస్తువులను ఇంటింటికీ ప్రభుత్వమే అందించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్​ చేశారు. అదే విధంగా ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. ప్రజల ప్రాణాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధిపై దృష్టి పెట్టకుండా పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు కృషి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details