ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకోకపోవటం బాధాకరం.. కానీ ! - పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన నల్లిమిల్లి

అనపర్తి నియోజకవర్గంలో పరిషత్తు ఎన్నికలను బహిష్కరించినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న తీరుకు నిరసనగా.. తెదేపా అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఓటు హక్కు వినియోగించుకోలేదని చెప్పారు.

ex mla nallamilli boycott parishd elections
ఓటు హక్కు వినియోగించుకోకపోవటం బాధాకరం

By

Published : Apr 8, 2021, 9:34 PM IST

వైకాపా అరాచకాలకు వ్యతిరేకంగా తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు అనపర్తి నియోజకవర్గంలో పరిషత్తు ఎన్నికలను బహిష్కరించినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అందులో భాగంగా పరిషత్తు ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకోలేదని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. కానీ...రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, ఎన్నికలు జరుగుతున్న తీరుకు నిరసనగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నడుచుకున్నట్టు వివరణ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details