ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గృహనిర్బంధం - జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గృహనిర్బంధం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్​లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. చలో అమరావతి నిర్వహించకుండా అడ్డుకున్నారు.

ex mla jyothula nehru house arres
మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గృహనిర్బంధం

By

Published : Oct 31, 2020, 11:50 AM IST

Updated : Oct 31, 2020, 4:53 PM IST

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. అమరావతి రైతులకు మద్దతుగా తలపెట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక నుంచి చలో అమరావతి చేపడుతున్నట్లు నెహ్రూ శుక్రవారం ప్రకటించారు. దీంతో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు జ్యోతుల నవీన్​నూ నిర్బంధించారు.

రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోంది

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు, ప్రతిపక్షాలు తమ సమస్యలను వినిపించుకునే పరిస్థితి లేకుండాపోయిందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు. జైల్ భరో కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఆయనను గృహనిర్భంధం చేశారు. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో పోలీసులు పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

భారీగా పోలీసుల మోహరింపు.. అడుగడుగునా తనిఖీలు

Last Updated : Oct 31, 2020, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details