తూర్పుగోదావరి జిల్లాలో వరద ముంపునకు గురైన విలీన మండలాలు, లంక గ్రామాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆహారం, తాగు నీరు, మందులు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
సీఎం జగన్ ప్రకటించిన రూ. 2వేల ఆర్థిక సాయంతోపాటు.. గతేడాది వరదల్లో నష్టపోయిన దేవీపట్నంలోని 36 గ్రామాలకు హామీ ఇచ్చిన విధంగా రూ. 5వేలు అందజేయాలన్నారు. ఈ ప్యాకేజీ అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వరద భయంతో కొండలపై తలదాచుకుంటున్న వారికి హెలికాఫ్టర్ ద్వారా తాగునీరు, ఆహారం సరఫరా చేయాలన్నారు.