వైకాపా ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలపై భారాన్ని మోపుతోందని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఇసుక కొత్త పాలసీ చూస్తే గతంలో టాక్టరు ఇసుక రూ.1500 ఉంటే ఇప్పుడు రూ.5,000గా ఉందని చెప్పారు.
లారీ ఇసుక అప్పుడు రూ.7,000 అయితే ఇప్పుడు రూ.30,000 ఉందన్నారు. విద్యుత్ బిల్లులు పెంచబోమని చెప్పి.. 4 రెట్లు పెంచారంటూ దుయ్యబట్టారు. జే టాక్స్ పేరుతో ఇష్టారీతిన మందుబాబులు జేబులు గుల్ల చేస్తున్నారని ఆరోపించారు.