ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతికి మద్దతుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు దీక్ష - గొల్లపల్లి సూర్యరావు

అమరావతి రైతులకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై మొండిగా ముందుకెళ్లడం అన్యాయమన్నారు.

ex minister gollapalli suryarao protest for amaravathi
అమరావతికి మద్దతుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు దీక్ష

By

Published : Aug 23, 2020, 6:23 PM IST

అమరావతి రైతులకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో తెదేపా నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి రైతుల ఆందోళన 250 రోజులకు చేరిన సందర్భంగా ఈ దీక్షకు పూనుకున్నారు.

మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులపై మొండిగా ముందుకెళ్లడం అన్యాయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details