ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో వైకాపా వేధింపులు మితిమీరిపోతున్నాయి: మాజీ మంత్రి చినరాజప్ప - రాష్ట్రంలో వైకాపా వేధింపులు మితిమీరిపోతున్నాయి

రాష్ట్రంలో వైకాపా వేధింపులు మితిమీరిపోతున్నాయని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామవరంలోని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను చినరాజప్ప పరామర్శించారు.

chirajappa condolence to ramakrishna reddy family
రాష్ట్రంలో వైకాపా వేధింపులు మితిమీరిపోతున్నాయి

By

Published : Jan 20, 2021, 5:17 PM IST

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ తేతలి సత్తిరాజురెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి చినరాజప్ప సంతాపం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. తెదేపా నాయకులే లక్ష్యంగా దాడులు చేయడం, కేసులు పెట్టడం వంటి అక్రమాలకు వైకపా పాల్పడుతున్నట్లు చినరాజప్ప ఆరోపించారు. అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని భయటపెడుతున్నాడనే రామకృష్ణా రెడ్డిపై దాడులు చేస్తున్నారని.. వేధింపుల్లో భాగంగానే చనిపోయిన సత్తిరాజురెడ్డి రెండవ భార్యతో రామకృష్ణా రెడ్డి కుటుంబసభ్యులపై కేసు పెట్టించడం హాస్యాస్పదమన్నారు.

రాష్ట్రంలో వైకాపా వేధింపులు మితిమీరిపోతున్నాయి

ప్రభుత్వం సీరియస్​గా తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో దేవాలయలపై దాడులు జరుగుతున్నాయన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో మంత్రి కన్నబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. అసలు ప్రవీణ్ ఎవరో కూడా తనకు తెలియదని చినరాజప్ప అన్నారు.

ఇదీ చదవండి:ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా..?- హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details