కడియం నర్సరీని సందర్శించిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం - digvijay singh
తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ పర్యటించారు. అక్కడి నర్సరీ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు.
దిగ్విజయ్ సింగ్
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని గంగుమల్ల నర్సరీని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ ఆదివారం సందర్శించారు. స్పెయిన్, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి తీసుకొచ్చిన పలు మొక్కలను తిలకించి వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని దిగ్వియజ్ సింగ్ అన్నారు. ఆయనకు నర్సరీ రైతులు గంగుమల్ల సత్యనారాయణ, తాతాజీ ఘన స్వాగతం పలికారు.