ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్ పరిపాలనలో అవినీతి ఆకాశమంత ఎత్తుకు పెరిగింది' - జగన్​పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తాజా వ్యాఖ్యలు

జగన్ పాలన​పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మండిపడ్డారు. సీఎం బలహీనతతో తితిదే చేయి జారిపోయే ప్రమాదం ఉందన్నారు. తితిదేపై భాజపా, ఆర్.ఎస్.ఎస్ కుట్ర పన్నుతున్నాయని ఆరోపణలు చేశారు.

ex central minister chinta mohan
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

By

Published : Feb 11, 2021, 4:12 PM IST

జగన్ పరిపాలనలో అవినీతి ఆకాశమంత ఎత్తుకు పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ విమర్శించారు. గనులు, ఇసుక, మద్యం నుంచి రూ.కోట్ల రూపాయలను మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని మండిపడ్డ ఆయన సీఎం బలహీనతతో తితిదే చేయి జారిపోయే ప్రమాదం ఉందన్నారు. తితిదేపై భాజపా, ఆర్.ఎస్.ఎస్ కుట్ర పన్నుతున్నాయని, వారి చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details