కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరోత్తి శివ గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశ ప్రజలందరూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని శివ గణేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రెండు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. జగ్గంపేట నియోజకవర్గంలో 25,000 సంతకాలు సేకరిస్తామని శివ గణేష్ తెలిపారు.
'వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలి' - agriculture acts 2020 news
దేశ ప్రజలందరూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాలని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శివ గణేష్ కోరారు. జగ్గంపేటలో ఆదివారం ఆయన ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది.
congress