తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ముమ్మిడివరం జనసేన కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. విదేశాల్లో స్థిరపడ్డ వారు అందించిన ఆర్థిక సహాయం ద్వారా... పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
వరద బాధితులకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ - తూర్పుగోదావరి జిల్లాలో కూరగాయలు పంపిణీ
గోదావరి వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి ఇబ్బందులను గమనించిన స్థానిక జనసేన పార్టీ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
వరద బాధితులకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ