రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులు, 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 54 మంది ఉపాధ్యాయులకు వీటిని అందజేశారు. సంస్థ ఛైర్మన్ గుబ్బల రాంబాబుతో పాటు ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ రామయ్య కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సంస్థ ద్వారా నిరంతరాయంగా సేవలు అందించడం హర్షనీయమని ఆయన అన్నారు.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరకుల పంపిణి - essential goods distribution at rajamahendravaram
రాజమహేంద్రవరంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ వారు ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రైవేటు విద్యాసంస్థల అధ్యాపకులు, ఉపాధ్యాయులు జీతాలు లేక పడుతున్న ఇబ్బందులకు స్పందించి సాయం అందించామని సంస్థ ఛైర్మన్ రాంబాబు తెలిపారు.
![ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరకుల పంపిణి ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరకుల పంపిణి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8792619-606-8792619-1600061114076.jpg)
ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరకుల పంపిణి