కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు చేయూత అందించేందుకు ఇవాంజిలికల్ మినిస్ట్రీస్ సంఘం ప్రతినిధులు ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామంలో ఆ సంఘం ప్రతినిధులు రాజబాబు, డాక్టర్ చిన్నం సిల్వస్టర్ ఆధ్వర్యంలో 110 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యంతో పాటు కూరగాయలను అందజేశారు. లోతట్టు గ్రామమైన గుర్తేడు, పాతకోట గ్రామాల్లోను ఇలా పంచిపెడతామని ప్రతినిధులు తెలియజేశారు.
ఇవాంజిలికల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసరాల పంపిణీ - kacchaluru village essential goods distribution
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఇవాంజిలికల్ మినిస్ట్రీస్ సంఘం తమ వంతు సాయం అందించారు. కచ్చులూరు గ్రామంలో ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యంతో పాటు కూరగాయలను అందజేశారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో అందజేసినట్లు తెలిపారు.

గిరిజనులకు నిత్యావసర వస్తువులు అందించిన దాతలు