ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలకు ఇస్తారా..?

తూర్పుగోదావరి జిల్లా ఎండపల్లి సమీపంలోని చెరువు భూముల్లో ఇళ్ల స్థలాల కోసం చదును చేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. గత 30 ఏళ్లుగా ఆ భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామంటూ ఆందోళన చేపట్టగా చేసేది లేక అధికారులు వెనుతిరిగారు.

చెరువు భూముల్లో మట్టి తవ్వొద్దంటూ ఆందోళన
చెరువు భూముల్లో మట్టి తవ్వొద్దంటూ ఆందోళన

By

Published : May 26, 2020, 11:52 PM IST

ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న చెరువు భూముల్లో మట్టి తవ్వొద్దంటూ తూర్పుగోదావరి జిల్లా ఎండపల్లిలో స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దోనే చెరువులో ఎస్సీ కుటుంబాలకు చెందిన 300 మంది గత 30 ఏళ్లుగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ చెరువును ఇళ్ల స్థలాల కోసం గుర్తించగా... స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో నిలిపేశారు. మళ్లీ ఇప్పుడు ఈ భూమిలో మట్టి తవ్వి ఇళ్ల స్థలాల కోసం చదును చేసేందుకు అధికారులు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడినా ఫలితం లేకపోవటంతో మట్టి తవ్వకం పనులు నిలిపివేశారు.

ఇదీ చూడండి:విద్యుత్​ స్తంభం ఎక్కిన ఐదేళ్ల బుడతడు.. కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details