భానుడి ప్రతాపం.. వడదెబ్బ బారిన ప్రజలు - endalu-calevendralu
వేసవిలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కత్తిపూడి నుంచి పామర్రు వరకు విస్తరించిన జాతీయ రహదారి 216 ఉదయం నుంచే నిప్పుల కొలిమిగా మారుతోంది.
వేసవిలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు సాగించవలసినవారు వడదెబ్బకు గురవుతున్నారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్న చలివేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ సరఫరా చేస్తున్నాయి. కాకినాడ నుంచి అమలాపురం వరకు నిత్యం రద్దీగా ఉండే రహదారిపై.... ఎండల తీవ్రత కారణంగా అరకొర వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కత్తిపూడి నుంచి పామర్రు వరకు విస్తరించిన జాతీయ రహదారి 216 ఉదయం నుంచే నిప్పుల కొలిమిగా మారుతోంది.
TAGGED:
endalu-calevendralu