పేద కుటుంబలో ఉన్న ఓ విద్యార్థికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అమ్మఒడి అందలేదు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. విద్యుత్ వాడకం 300యూనిట్లు దాటిందని కారణం చూపుతూ.. అధికారులు అమ్మఒడి పథకాన్ని నిలిపివేశారు. కానీ తమ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటలేదని అధికారులకు చెప్పి నెలలు గడిచిపోతున్న పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ముంగండ పాలానికి చెందిన మల్లవరపు వెంకట నాగరాజు, కనకమహాలక్ష్మి దంపతుల కుమారుడు సూర్యతేజ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అతనికి అమ్మఒడి రాలేదు. ప్రభుత్వం స్పందించి అమ్మఒడి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.