ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా.. 11 మంది అరెస్టు - yerramshettivaripalem latest news

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 6 లారీలు, 2 జేసీబీలు స్వాధీనం చేసుకుని... పదకొండు మందిని అరెస్టు చేశారు.

lorries
లారీలు స్వాధీనం

By

Published : May 20, 2021, 2:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో.. పోలీసులు దాడులు చేశారు. ఇసుక అక్రమ రవాణాల చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. పి.గన్నవరం మండలం ఏనుగుపల్లి గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు గతంలో అధికారులు అనుమతినిచ్చారు.

ఈ వంకతో రాత్రి సమయంలో ఎర్రంశెట్టివారిపాలెం సమీపంలోని గోదావరి నుంచి ఏనుగు పల్లి గ్రామానికి ఇసుక రవాణా చేస్తున్నారని పి. గన్నవరం ఎస్సై జి.సురేంద్ర తెలిపారు. అర్థరాత్రి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు చేసిన దాడుల్లో 6 లారీలు, 2 జేసీబీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details