ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందిన కేసు.. 11 మంది అరెస్ట్ - east godavari news

అడవి జంతువులను వేటాడటం కోసం.. కొందరు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి అశోక్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన.. ఈ నెల 27న తూర్పు గోదావరి జిల్లా గోవిందపురంలో జరిగింది. ఈ ఘటనకు కారణమైన 11మందిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు.. జగ్గంపేట సీఐ సురేష్ బాబు తెలిపారు.

eleven people arrested in man killed with current shock case at govindapuram in east godavari
అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి.. 11 మంది అరెస్ట్

By

Published : Jan 30, 2021, 10:23 AM IST

అడవి జంతువులను వేటాడి.. సొమ్ము చేసుకునేందుకు.. అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కలిదిండి సురేష్ పశువులు కాస్తూ.. వ్యవసాయం చేసుకునేవాడు. ఈ క్రమంలో అడవిలోకి వెళ్లి తిరిగి వస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అటవీ అధికారులకు, విద్యుత్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. దుంప తోటల మధ్య కరెంటు ట్రాప్స్ పెడుతుండటంతో.. పెంపుడు జంతువులు సైతం అవి తగిలి విద్యుత్ షాక్​కు గురై మృత్యువాతపడుతున్నాయని వాపోతున్నారు.

తప్పిపోయిన తన గేదెను వెతుక్కుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అశోక్.. అక్కడ అక్రమార్కులు అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్​కు గురై దుర్మరణం చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందని, ఈ ఘటనలో అశోక్ కుమార్ మృతికి కారకులైన మొత్తం 11మందిన అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు.. జగ్గంపేట సీఐ సురేష్ బాబు తెలిపారు. జంతువులను వధించడం కోసం అర్ధరాత్రులు చట్టవిరుద్ధంగా జి వైర్లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించే లేదని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details