తూర్పు గోదావరి జిల్లా అప్పలరాజు పేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అద్దేపల్లి సువార్త అనే వ్యక్తి తాటాకు ఇల్లు దగ్ధం అయింది. స్థానికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికి ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో సువార్త కుటుంబం నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనలో 1.60 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు గ్రామ రెవెన్యూ అధికారి భారతి వెల్లడించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో తాటాకు ఇల్లు దగ్ధం.. - అప్పలరాజు పేట గ్రామంలో విద్యుత్ ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం అప్పలరాజు పేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో 1.60 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు ఇల్లు దగ్ధం..