ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. యానాంలో ప్రచార సందడి - పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను కలిసి తన గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. 15 మంది బరిలో నిలిచారు. ఐదుగురు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

యానాంలో ప్రచార సందడి
యానాంలో ప్రచార సందడి

By

Published : Mar 24, 2021, 5:47 PM IST

కేంద్ర పాలిత పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. నియోజకవర్గాల్లో హోరెత్తుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులు ఓటర్లను కలిసి తమ గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. బరిలో మొత్తం 15 మంది నిలిచారు. ఐదుగురు మాత్రేమే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.

యానం అసెంబ్లీ స్థానానికి ఎన్డీయే కూటమి నాయకుడు, ఎన్నార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా భాజపా, ఎన్నార్ కాంగ్రెస్, డీఎంకే పార్టీల నేతలు ఓ గ్రూపుగా.. మాజీ శాసన సభ్యులు మల్లాడి కృష్ణారావు అతని అనుచరులు అంతా ఒక గ్రూపుగా ఏర్పడి.. గ్రామాలు.. పట్టణాల్లో ప్రచారం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details