పింఛను కోల్పోయిన వయో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వీరికి తెదేపా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ పింఛనుపై ఆధారపడి జీవిస్తోన్న నిరుపేదలకు అకస్మాత్తుగా పింఛన్ తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పింఛన్లు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. అయితే వారంలో పునరుద్దరిస్తామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి చెప్పినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందనలో కలెక్టర్, జేసీ లేకపోవడం వల్ల జేసీ - 2 రాజకుమారికి ఫిర్యాదు దారులు వినతులు అందజేశారు.
పింఛన్, తెల్లరేషన్ కార్డుల తొలగింపుపై 'స్పందన' ఏదీ..? - తెల్లరేషన్ కార్డులు కోల్పోయిన బాధితుల వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్పందన కార్యక్రమానికి పింఛను, తెల్లరేషన్ కార్డులు కోల్పోయిన బాధితులు వెల్లువెత్తారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ పింఛన్‌పై ఆధారపడి జీవిస్తోన్న నిరుపేదలు.. అకస్మాత్తుగా పెన్షన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో పునరుద్దరిస్తామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి చెప్పినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని మాజీ ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ స్పందన
TAGGED:
spandhana latest news update