ఆదరవు కోసం ఆశగా చూస్తూ.. - elderly couple problems rajamahendravaram
కన్నబిడ్డలు తనువు చాలించారు. అయినావారంతా దూరం చేశారు. ఆదుకునే వారు లేక ఆదరవు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారీ జంట.
శివాలయం వద్ద వృద్ధ దంపతులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పేరూరి రామారావు, వీరకుమారి దంపతులు ఒకప్పుడు బాగా బతికారు. వీరి ఇద్దరు కుమారులూ మరణించారు. బంధువులెవరూ ఆదరించక రామచంద్రపురంలోని ఆశ్రమంలో తలదాచుకున్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలించక 20 రోజుల క్రితం కాకినాడ వచ్చి శివాలయం వద్ద కాలం వెళ్లదీస్తున్నారు. తమకు ప్రభుత్వ పింఛను రావడం లేదని... ఆశ్రయం కల్పించాలని దీనంగా వేడుకున్నారు.