తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో గురువారం మత్స్యకారులకు భారీ ట్యూనా చేప దొరికింది. ఏడు అడుగుల పొడవు, ఎనభై కిలోల బరువున్న ఈ ట్యూనా చేప మత్స్యకారులకు చిక్కడంతో దీనిని తీరం ఒడ్డుకు చేర్చడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ చేపను ఓ వ్యాపారి ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేసి.. కేరళకు ఎగుమతి చేశాడు. ఇంత భారీ చేప ఉప్పాడ చేపలరేవులో దొరకడంతో సందర్శకులు ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు చిక్కిన భారీ చేప - ఉప్పాడ చేపలరేవులో ట్యూనా చేప తాజా వార్తలు
ఏడడుగుల చేప ఏడు వేల ధరతో అమ్ముడుపోయింది. దీని బరువెంత అనుకుంటున్నారా.. ఎనభై కిలోలు. భారీ చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు కాస్త శ్రమించాల్సి వచ్చింది. దీనిని ఫొటోలో బంధించేందుకు పలువురు పోటీ పడ్డారు.
![ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు చిక్కిన భారీ చేప Eighty kilograms of tuna fish in the Uppada fish pond](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10974549-6-10974549-1615525625857.jpg)
ఉప్పాడ చేపలరేవులో ఎనభై కిలోల భారీ ట్యూనా చేప