ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుని శస్త్ర చికిత్సకు సీఎం సహాయనిధి నుంచి రూ. 18 లక్షలు - తూర్పుగోదావరి జిల్లాలో బాలుడి కాలేయ శాస్త్ర చికిత్స కోసం సీఎం సహయనిధి నుంచి సొమ్ము

కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఐదేళ్ల బాబుకు శస్త్ర చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి 18 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మెుత్తాన్ని ఎల్​ఓసీని ఎంపీ అనురాధ రాజ్ కుమార్ బాలుడి తల్లిదండ్రులకు అందించింది.

సీఎం సహయనిధి
CMs Assistance Fund

By

Published : Jun 18, 2021, 9:24 AM IST

కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఐదేళ్ల బాబుకు శస్త్ర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 18 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా మొండెపు లంక గ్రామానికి చెందిన బొమ్మిడి రాజకుమార్ అనే ఐదు సంవత్సరాల బాబుకు కాలేయ మార్పిడి నిమిత్తం 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.

నిరుపేద కుటుంబానికి చెందిన బాబు తల్లిదండ్రులు అమలాపురం ఎంపీ చింతా అనురాధ ద్వారా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 18 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మొత్తానికి సంబంధించిన ఎల్​ఓసీ ని ఎంపీ అనురాధ.. రాజ్​కుమార్ తల్లిదండ్రులకు అందజేశారు. చికిత్స అందించే ఈ సొమ్మును ఆసుపత్రికి నగదు రూపంలో జమ అవుతుందని ఎంపీ అనురాధ వెల్లడించారు.

ఇదీ చదవండీ..Notice: పరీక్షలు రద్దు చేయని ఏపీ సహా 4 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

ABOUT THE AUTHOR

...view details