తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లో రెడ్జోన్లు ఏర్పాటు చేశారు. ఈ మండలంలోని మాచవరం, పుల్లేటికుర్రు, ఇసుక పూడి గ్రామాలలో మొత్తం ఈ రోజు వరకు 8 కేసులు బయటపడ్డాయి. దీంతో ఆయా గ్రామాల పరిధిలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రెడ్జోన్లు ఆంక్షలు ప్రకటించారు. అంబాజీపేటలో బుధవారం జరిగే వారపు సంత, పశువుల సంతను రద్దు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు.
అంబాజీపేట మండలంలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు - అంబాజీపేటలో కరోనా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లో రెడ్జోన్లు ఏర్పాటు చేశారు.
![అంబాజీపేట మండలంలో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు eight corona cases in ambajipeta zone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7848438-244-7848438-1593611757132.jpg)
అంబాజీపేట మండలంలో 8 కరోనా పాజిటివ్ కేసులు