తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో కోడిగుడ్లు పంపిణీ చేశారు. పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా కరోనాను ఎదురించవచ్చని జిల్లా తెదేపా ఉపాధ్యాక్షులు వల్లూరు సాయి కుమార్ అన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి ఏర్పాటు చేసిన కోడిగుడ్లను నెక్ జాతీయ కమిటీ సభ్యులు పడాల సుబ్బారెడ్డి వల్లూరు సాయి కుమార్ ఇంటింటికీ పంపిణీ చేశారు.
ఇంటింటికీ కోడిగుడ్లు అందజేసిన తెదేపా నేతలు - ఇంటింటికీ కోడిగుడ్లు అందజేసిన అర్తమూరు తెదేపా నేతలు
పౌష్టికాహారం ఎక్కువుగా తీసుకుంటే, కరోనాను ఎదుర్కొనగలమని తూర్పు గోదావరి జిల్లా తెదేపా ఉపాధ్యాక్షులు వల్లూరు సాయి కుమార్ అన్నారు. తెదేపా ఆధ్వర్యంలో అర్తమూరు గ్రామంలో ఇంటింటికీ కోడిగుడ్లను అందించారు.
ఇంటింటికీ కోడిగుడ్లు అందజేసిన తెదేపా నేతలు