వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్-19 వైరస్‌పై అధికారులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలనూ అప్రమత్తం చేసి... కార్యాచరణ సిద్ధం చేశారు. ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. కరోనా అనుమానితుల నుంచి రక్తం, గొంతు, ముక్కు నుంచి ద్రవాలను సేకరించి... ఆ నమూనాలను కాకినాడ జీజీహెచ్‌కు పంపించే ఏర్పాట్లు చేశారు. అక్కడ నమూనాలు పరీక్షించి ఫలితాలను వెల్లడిస్తున్నారు.
'కరోనాను ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు సిద్ధం' - undefined
కరోనా కట్టడికి తూర్పుగోదావరి జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా అప్రమత్తమయ్యారు.
కరోనాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం
జిల్లాకు 52 దేశాల నుంచి వచ్చిన 1,221 మందిని గుర్తించి... వారి కదలికలపై అధికారులు నిఘా పెట్టారు. వారు తిరిగిన ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ దిశగా వైద్య, ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి. అనుమానిత కేసులున్న చోట మాస్కులు ధరించి.. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా ప్రభావంపై ఎంపీ సమీక్ష