ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజానగరంలో హుషారుగా ఈనాడు క్రికెట్ పోటీలు - ఈనాడు స్పోర్ట్స్ మీట్ లీగ్ వార్తలు

ఈనాడు క్రికెట్ పోటీలు పదో రోజు ఉత్కంఠగా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల, గైట్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించారు.

eenadu cricket sports women league at rajanagaram in east godavari district
కేరింతలతో గెలుపొందిన జట్ల సందడి

By

Published : Dec 29, 2019, 11:02 AM IST

రాజానగరంలో హుషారుగా మహిళల క్రికెట్ మ్యాచ్

తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఈనాడు క్రికెట్ పోటీలు జరిగాయి. జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన ఆటలో.. కోరంగి కైట్ క్యాంపస్ జుట్టుపై అనపర్తి జీవియార్ డిగ్రీ కళాశాల ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అన్నవరం ఎస్వీవీఎస్ డిగ్రీ కళాశాల జుట్టుపై కోటనందూరున మదర్ డిగ్రీ కళాశాల 38 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఆదిత్య డిగ్రీ కళాశాల కాకినాడ మహిళల జట్టుపై తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్టు 98 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది.

రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల.. రాజమహేంద్రవరం మెగా జూనియర్ కళాశాల జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కె పెరుమల్లపురం హార్వర్డ్ జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం మాతృశ్రీ జూనియర్ కళాశాల జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. అమలాపురం బీవీసీ కళాశాల జుట్టు పై రాజమహేంద్రవరం గైట్ కళాశాల జట్టు రెండు పరుగుల తేడాతో నెగ్గింది.

ABOUT THE AUTHOR

...view details