ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరిలో.. ఈదురుగాలులతో వర్షం - rain

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

ఈదురుగాలులు

By

Published : Jun 10, 2019, 6:58 AM IST

తూర్పుగోదావరిలోని పలుమండలాల్లో ఈదురుగాలులతో వర్షం

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి, జగ్గంపేట మండలాల్లో ఈదురుగాలులుతో వర్షం కురిసింది.. గాలుల ధాటికి కిర్లంపూడిలో చెట్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంట తర్వాత చెట్టు తొలగించటంతో ట్రాఫిక్ సమస్య తీరింది. జగ్గంపేట మండలంలోని కొత్తూరులో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గోవిందపురం లో కొండలరావు అనే రైతు కి చెందిన రెండు గేదెలు, 20 కోళ్లు పిడుగుపడి మృతి చెందాయి.

ABOUT THE AUTHOR

...view details